Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు పట్టణ బంద్ కరపత్రాల ఆవిష్కరణ

ఆలేరు పట్టణ బంద్ కరపత్రాల ఆవిష్కరణ

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 31న స్థానిక బస్టాండ్ వద్ద రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులు పట్టణ బంద్, ధర్నా చేపట్టనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వారు రైల్వే స్టేషన్ ప్రాంగణం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలేరు పట్టణ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పత్రిక విలేకరులు, మేధావులు అందరు పాల్గొని, ఆలేరు అభివృద్ధి కోసం జరిగే రెవిన్యూ డివిజన్ సాధనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ  కన్వీనర్ పసుపునురి వీరేశం, కో కన్వీనర్ ఎండి సలీం, రాచకొండ జనార్ధన్, చెక్క వెంకటేష్, మామిడాల బిక్షపతి,కందుల మధు, బేతి కృష్ణ హరి, కామటికార్ అశోక్ ,ఆడెపు బాలస్వామి, జంపాల శ్రీనివాస్ , వడ్డేమాన్ నరేందర్ ,పేరపు రాములు ,మొరిగాడి రమేష్, ఇక్కిరి శ్రీనివాస్, ఎండి రఫీ, ఎండి గౌస్ ,యూసుఫ్, శంకర్, చింతకింది రామానుజన్, వీరస్వామి, మోరిగాడి అశోక్ సభ్యులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -