– గిరిజనులకు వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ
‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా బీఆర్ఎస్ సేవా కార్యక్రమం
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, వెన్నెల హాస్పిటల్ సౌజన్యంతో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలు, తండాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు.
శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రావతి ప్రారంభించారు. డాక్టర్ భూక్యా ప్రసాద్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాసాని చంద్రమోహన్ సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
డాక్టర్ ఉదయ జ్యోతి, డాక్టర్ భూక్యా ప్రసాద్ రావు, డాక్టర్ చంద్రావతి, డాక్టర్ పూర్ణ చంద్ ఆధ్వర్యంలో వందలాది మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు, పండ్లు పంపిణీ చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించారు.
రెడ్డిగూడెం తో పాటు సుద్దగోతులగూడెం, తోగ్గూడెం, తిరుమలకుంట, పాకాలగూడెం తదితర మారుమూల గిరిజన గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలోనే నిపుణులైన వైద్యుల సేవలు అందడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు కేక్ కట్ చేసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జుజ్జురపు శ్రీరామమూర్తి, సత్యవరపు సంపూర్ణ, బిర్రం వెంకటేశ్వరరావు తదితరులు ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించారు.
పల్లెల అభివృద్ధికి కేటీఆర్ కృషి మరువలేనిది
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి, తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ విశేష కృషి చేశారని అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మారుమూల గ్రామాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.
ప్రజా సేవే కేటీఆర్ కు నిజమైన కానుక
బీఆర్ఎస్ నాయకురాలు కాసాని నాగ శేష పద్మ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కేటీఆర్‌కు తాము ఇచ్చే అసలైన జన్మదిన కానుక అని పేర్కొన్నారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ పార్టీ సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డి.కె.ఎమ్. మహిపాల్, కోటగిరి సీతారామస్వామి, రావు జోగేశ్వరరావు, జూపల్లి రమణరావు, జుజ్జురు వెంకన్నబాబు, మోహన్ రెడ్డి, సంక ప్రసాద్,మోటూరు మోహన్, ఉమ్మల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. స్థానిక గిరిజనులు బీఆర్ఎస్ నాయకులు, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.



