దేశ విద్యార్థులకు, యువతకు
అభినందనలు : ఎంఎ బేబీ
నవతెలంగాణ-హైదరాబాద్
మతతత్వ ధోరణి కలిగిన ఎన్ఇపి-2020ని కూడా వెనక్కి తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. నిరసనకారులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని, మన విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసు సిబ్బంది అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘అభిజీత్ దీప్కే, సోనమ్ వాంగ్‌చుక్, ఎస్ఎఫ్ఐ నేతలతో సహా పోరాటం మార్గంలో దృఢంగా నిలిచి, అన్ని రకాల బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొన్న విద్యార్థి సంఘాలన్నింటికీ కూడా అభినందనలు. క్రీడలు, కళలు, సినిమా, సంస్కృతి వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం ఎంతో సంతోషకరం. ఐక్య పోరాటాలు విజయాన్ని సాధిస్తాయని ఈ అనుభవం మనకు తెలియజేస్తోంది. మన డిమాండ్లన్నీ నెరవేరే వరకు మనం దృఢంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలి. ముందుకు సాగుదాం మిత్రులారా’ అని పేర్కొన్నారు.



