రైతు వేదికలో విత్తనమేళ
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
జక్రంపల్లి మండలంలోని రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు జక్రంపల్లి రైతు వేదిక వద్ద విత్తనమేల కార్యక్రమం చేపట్టడం జరిగినదని మండల వ్యవసాయ అధికారి దేవిక తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి దేవిక మాట్లాడుతూ ఎల్ నీ నో పరిస్థితిలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తక్కువ నీటితో సాగు అయ్యే పంటలు అనగా కందులు, మినుములు, పెసలు కూరగాయలను రైతులకు ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విత్తనమేల జక్రాంపల్లి రైతు వేదిక వద్ద 27.07.2026 నుండి 29.07.2026 వరకు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులందరూ కూడా ఈ విత్తనమేలని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతన్నలు పాల్గొనడం జరిగినది.
రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



