Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎం.ఏ. ఇక్బాల్‌ను పరామర్శించిన జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్

ఎం.ఏ. ఇక్బాల్‌ను పరామర్శించిన జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్

- Advertisement -

నవతెలంగాణ-ఆలేర్ రూరల్ 
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎం.ఏ. ఇక్బాల్ ఇటీవల విజయవంతంగా కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ బుధవారం ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు ఇక్బాల్ కంటి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ స్వయంగా ఆయనను కలిసి, ఆపరేషన్ విశేషాలను, కంటి చూపునకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.

ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి హక్కుల కోసం పోరాడే ఇక్బాల్ లాంటి నాయకులు త్వరగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని జహంగీర్ ఆకాంక్షించారు.ఆయన మళ్లీ పూర్తి ఆరోగ్యంతో యథావిధిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి, పార్టీ బాధ్యతలను మరియు ప్రజా ఉద్యమాలను ఉత్సాహంగా ముందుకు నడిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.వైద్యుల సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయనతోపాటు ఇక్బాల్ ను పరామర్శించిన వారిలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  వనం శాంతి కుమార్,సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం,సిపిఐ(ఎం) నాయకులు మొరిగాడి రమేష్,జూకంటి పౌలు,చేనేత కార్మిక సంఘం నాయకులు,ముషం నరహరి,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చేన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -