Thursday, July 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాక్‌పై అమెరికా-సౌదీ దాడులు

ఇరాక్‌పై అమెరికా-సౌదీ దాడులు

- Advertisement -

20 మంది మృతి.. పలువురికి గాయాలు
బాగ్దాద్‌ :
ఇరాక్‌పై అమెరికా-సౌదీ సేనలు బుధవారం విరుచుకుపడ్డాయి. ఈ దాడులలో మాజీ పార్లమెంటరీ కూటమికి చెందిన కనీసం 20 మంది చనిపోయారు. ఈ కూటమిలో ఇరాన్‌ అనుకూల గ్రూపులు కూడా ఉన్నాయి. మాజీ పార్లమెంటరీ గ్రూపులు, ఇరాక్‌ సాయుధ దళాలలో భాగస్వాములైన వర్గాలతో ఏర్పడిన పాపులర్‌ మొబిలైజేషన్‌ ఫోర్సెస్‌ (పీఎంఎఫ్‌) అందించిన సమాచారం ప్రకారం ఏడు రాష్ట్రాలలోని కూటమి స్థావరాలపై అమెరికా-సౌదీ జరిపిన దాడులలో కనీసం 20 మంది చనిపోగా 32 మంది గాయపడ్డారు. కాగా అమెరికా సేనల పైన, సౌదీ చమురు స్థావరాల పైన జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇరాక్‌లో ఇరాన్‌ మద్దతిస్తున్న ఉగ్రవాదులపై దాడులు చేశామని అమెరికా-సౌదీ అరేబియా ఆరోపించాయి.
2014లో జిహాదీలపై పోరాడేందుకు పారామిలటరీలు, వర్గాలతో ఏర్పడిన కూటమే పీఎంఎఫ్‌. ఇప్పుడది ఇరాక్‌ సాయుధ దళాలలో కలిసిపోయింది. కూటమిలోని కొన్ని గ్రూపులకు ఇరాన్‌ మద్దతు ఇస్తున్నప్పటికీ వీటిలో చాలా వరకూ స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నాయి. అమెరికా-సౌదీ ప్రమాదకరమైన దాడులకు పాల్పడుతున్నాయని, ఇరాక్‌ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ఇది తమ అధికారిక భద్రతా సంస్థలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పీఎంఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఇరాక్‌లో ఇరాన్‌ మద్దతున్న గ్రూపులు తమ చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌ దాడులు చేశాయని, తమ సేనలు వాటిని నిలువరించాయని సౌదీ అంతకుముందు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -