Thursday, July 30, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో బుధువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపత్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీదేవి సూచించారు. గురువారం మండలంలో భారీ వర్షాలు కురవడంతో ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ప్రజలు, పిల్లలు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు కు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. అదేవిధంగా భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతాయని  వాటిని దాటే ప్రయత్నాలు చేయవద్దన్నారు ప్రమాదకరమైన ఇండ్లలో ఉండకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండేలా చూడలన్నారు. ఏదైనా అత్యవసర సమయాల్లో అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -