Saturday, March 21, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలుగులో ‘ధురంధర్-2’ రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్

తెలుగులో ‘ధురంధర్-2’ రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ‘ధురంధర్‌ 2’ సినిమా కోసం ఎదురుచూస్తోన్న తెలుగు ప్రేక్షకులకు శుభవార్త. శనివారం నుంచి ఈ సినిమా తెలుగులో విడుదల కానున్నట్లు సమాచారం. ఈమేరకు నేటి (మార్చి 21) షోలకు తెలుగు వెర్షన్‌కు బుకింగ్స్‌ ఓపెన్‌ అవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

మొదట మార్చి 18న ప్రీమియర్స్‌, మార్చి 19న హిందీ వెర్షన్‌తో పాటు విడుదల చేయాలని ప్లాన్‌ చేసినప్పటికీ, కంటెంట్‌ డెలివరీలో జాప్యం, టెక్నికల్‌ ఇబ్బందుల వల్ల షోలు రద్దయ్యాయి. దీంతో టిక్కెట్లు బుక్‌ చేసిన ప్రేక్షకులకు రీఫండ్లు ఇవ్వాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా Central Board of Film Certification (CBFC) తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పరిస్థితి సర్దుకుంది. ఈ వెర్షన్లు మార్చి 19న సర్టిఫై కాగా, కన్నడ వెర్షన్‌ మాత్రం ఇంకా అనుమతికి ఎదురుచూస్తోంది.

మొదటి భాగం ‘ధురంధర్‌’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ‘ధురంధర్‌ 2’ ఇప్పటికే మొదటి రోజే సుమారు రూ.240 కోట్ల ఓపెనింగ్‌తో దూసుకుపోతోంది. ఇప్పుడు డబ్బింగ్‌ వెర్షన్లు కూడా చేరడంతో ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -