Saturday, August 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకట్ రెడ్డి కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పెన్ గంగా ఉదృతంగా ప్రవహిస్తుందోదన్నారు. పెండలవాడ, సాంగ్వి, కౌట బేల మండలంలోని పలు గ్రామాల్లో జిల్లాలో అధిక వర్షపాతం వలన అనేక గ్రామాల్లో పంటలు నష్టపోవడం జరిగిందని పేర్కొన్నారు. కొన్ని వందల ఎకరాలే నష్టపోయినప్పటికీ రైతులను ఆదుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలన్నారు. అంచనా వేసి వారికి పంటలు వేసుకోవటానికి సబ్సిడీ విత్తనాలు గాని ఎరువులు గాని ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రైతులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు షేక్ పాషా, మెహబూబ్ ఖాన్, జిల్లా అధ్యక్షులు గణేష్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుల సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -