Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం

ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం

- Advertisement -

మంత్రి శ్రీధర్ బాబు అదేశాలతోనే డేంజర్ జోనో సర్వే
ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో డేంజర్ జోన్లో నివసిస్తున్న అర్హులైన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో న్యాయం జరుగుతుందని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు,తాడిచెర్ల, కాపురం భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్,గ్రామ సర్పంచ్ బండి స్వామి అన్నారు.మంత్రి శ్రీదర్ బాబు,కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో ఓసిపి బ్లాక్-1లోని మీటర్ల దూరంలో డేంజర్ జోన్లో టిఎస్ జెన్కో ఉపరితలంలో నిర్వహిస్తున్న సర్వేను శనివారం పరిశీలించారు.ఈ సంధర్బంగా మాట్లాడారు దశాబ్ద కాలంగా ఉపరితల బొగ్గు గనిలో బొగ్గు నిల్వలు వెలికి తీస్తున్న క్రమంలో దుమ్ము,దూలి,భూమి పోరాల్లో నుండి వచ్చే వివిధ రకాల విషపు గ్యాస్ లతో డేంజర్ జోన్ ప్రాంత ప్రజలు అనేక రోగాల బారినపడి,కొందరు ప్రాణాలు వదిలారని,బొగ్గు వెలికి తీసే క్రమంలో జరిపే బ్లాస్టింగ్ వల్ల అనేక ఇల్లు కూలిపోవడం,గోడలు నెర్రలు బారడం,ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనాన్ని సాగిస్తున్నామని,డేంజర్ జోన్ ప్రాంతం నుండి మమ్ములను సురక్షితమైన ప్రాంతానికి తరలించండని గత తొమ్మిదేళ్లుగా పోరాటం చేసినట్లుగా,ఈ పోరాటంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టారని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి శ్రీధర్ బాబు 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా డేంజర్ జోన్ నిర్వాసితులకు ఇచ్చిన మాట కట్టుబడి జెన్కో సిఎండి,ఉన్నతాధికారులతో ఇటీవల మాట్లాడి డబ్బులు సైతం జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేయించినట్లుగా తెలిపారు.ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నిర్వాసితులు నమ్మద్దని సర్వే బృందాలకు సహకరించాలని అవసమైతే ప్రజా ప్రభుత్వం,హైకోర్టు న్యాయ నిపుణుల పర్యవేక్షణలో ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.పంచాయితీ రికార్డుల్లో ఉన్నవి,రికార్డులో లేని ఇళ్లను కూడా సర్వే చేస్తారని ఎవరు ఆందోళనకు గురికావద్దని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -