- Advertisement -
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి సమీపంలోని గుడిపాడు శివారు ధ్యాన పిరమిడ్‌లో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులందరూ ఒకరికొకరు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమానికి హాజరైన పిరమిడ్ నిర్వాహకురాలు సుస్మిత, యోగా గురువు వీరబాబు మాట్లాడుతూ జీవితంలో స్నేహం యొక్క విశిష్టత, ప్రాముఖ్యతను సభ్యులకు వివరించారు. అనంతరం అందరూ కలిసి ప్రత్యేక ధ్యానం, యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో స్థానిక ధ్యాన, యోగా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -



