నవతెలంగాణ – పెద్దవంగర
ఆర్ఎంపీ, పీఎంపీ మండల నూతన అధ్యక్షుడిగా బొమ్మకల్ గ్రామానికి చెందిన పొడిశెట్టి సైదులు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల మండల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా సుధగాని రామ్మూర్తి, ఉపాధ్యక్షుడిగా పులుగుజ్జ రామచంద్రు, కోశాధికారిగా కనుకుంట్ల సంపత్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సైదులు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు అర్హతలు, నిబంధనలకు లోబడి మాత్రమే వైద్య సేవలు అందించాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో రోగులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించాలని పేర్కొన్నారు. గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తి పరిరక్షణ కోసం సంఘం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తమ ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.



