ముందు మనిషిగా స్పందిద్దాం,
మనసారా యువత గొంతు విందాం
వారి కలలు కేవలం వారివి కావు,
భారత భవిష్యత్తును వెలిగించే జ్ఞాన దీపాలు
వారి అడుగులు అభివృద్ధి బాటలు,
వారి ఆలోచనలు నవ భారత స్వప్నాలు.
రాజకీయాలకు అతీతంగా,
వారి ఆశయాలకు అండగా నిలుద్దాం.
జంతర్ మంతర్ ఘటనలో వినిపించిన
విద్యార్థుల స్వరం ఒక హెచ్చరిక.
ఆ స్వరాన్ని అణచడం కాదు,
అర్థం చేసుకోవడమే
మనఅందరి బాధ్యత.
ఈగలనుకుని తోలితే
కందిరీగలై కుట్టాయి
చీమ లనుకుని నలిపారే
సుశిక్షిత సైనికీలై నిలిచారు
నిరసనలోనూ దేశభక్తి ఉంటుంది,
ప్రశ్నలోనూ పురోగతి దాగి ఉంటుంది.
యువతను గెలిపిస్తే దేశం గెలుస్తుంది,
వారి భవిష్యత్తును కాపాడితే భారత్ వెలుగుతుంది.
మన తరం ఇచ్చే గొప్ప వారసత్వం
ఆస్తులు కాదు… అవకాశాలు.
యువత కలలను కాపాడే ప్రతి చేయి
భారత భవిష్యత్తును నిర్మించే పునాది.
డా దుంపా శ్రీదేవి, +91 94404 81111
ముందు మనిషిగా…
- Advertisement -
- Advertisement -


