మూసీ సాహిత్య ధార, మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి ధూళిపాళ అరుణ రచించిన తారావళీ సప్తకం (ఆచార్య అప్పాజోస్యుల వారి తారావళీ సప్తక సమగ్ర సంమీక్ష) పుస్తకావిష్కరణ – అంకితోత్సవ సభ ఈ నెల 5న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం మొదటి అంతస్తులో జరుగుతుంది. ఆచార్య సాగి కమలాకరశర్మ, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, గన్నమరాజు గిరిజా మనోహరబాబు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, శ్రీమతి పద్మశ్రీ చెన్నోజ్వల, డా. ఏల్చూరి మురళీధరరావు, డా. కొండపల్లి నీహారిణి, శ్రీమతి రాధికా సూరి పొల్గొంటారు.
రెండుతరాల కవిసంగమం
రెండు తరాల కవిసంగమం సీరీస్ -46 ఈ నెల 8 న సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం సుల్తాన్ బజార్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ కవి సంగమంలో ప్రొ. బెల్లి యాదయ్య, రోహిణి వంజారి, జాబేర్ పాషా, ప్రమోద్ వడ్లకొండ, ఎస్ ఎస్ తరుణ్ పాల్గొంటారు. – కవిసంగమం
9న ‘పెన్నిధి’ పద్యకావ్య ఆవిష్కరణ
అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ, అక్షరకుసుమాలు, హైదరాబాద్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోడీహళ్ళి ఫణి ప్రసన్న కుమార్ (బెంగళూరు) రచించిన ‘పెన్నిధి’ పద్యకావ్య ఆవిష్కరణ ఈ నెల 9న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య భవన్, ప్రగతి నగర్ లో జరుగుతుంది. ఈ సభకు సాదనాల వేంకటస్వామి నాయుడు, డా॥ వింజమూరి విశ్వనాథమయ్య, డా॥ ఆచార్య ఫణీంద్ర, డా॥ రాధశ్రీ, మొవ్వ దేవనాథ సూరి, వేదాంతం శ్రీపతిశర్మ, మల్లయాచారి తదితరులు పాల్గొంటున్నారు. – కోడీహళ్ళి మురళీమోహన్
మాదిగ కవిత్వానికి ఆహ్వానం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సాహితీవేత్తల నుండి మాదిగ జీవితం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కవితలను ఆహ్వానిస్తున్నాం. కవిత 25–35 పంక్తుల మధ్య ఉండవచ్చు. మాదిగ జీవితం, సంస్కృతి, అనుభవాలు, ఆత్మగౌరవం, సామాజిక వాస్తవాలను ప్రతిఫలించేలా ఉండాలి. కవితలను ఆగస్టు 30 లోపు WhatsApp (7702665815) లేదా ఈ-మెయిల్: [email protected] కి పంపాలి.
తారావళీ సప్తకం పుస్తకావిష్కరణ
- Advertisement -
- Advertisement -


