Sunday, August 2, 2026
E-PAPER
Homeదీపికఅంతరంగం అట్టడుగున

అంతరంగం అట్టడుగున

- Advertisement -

నీవు ఎవరివైనా
పౌరుడివో, అపౌరుడివో
కవివో, నిరక్షరాస్యుడివో
వారు ద్వేషించే బొద్దింకవో
చైతన్య పురి విప్పి ఆడే నెమలివో
అలసిన వలస కార్మికుడివో
పేవ్మెంట్ పై పవళించే
అడ్రసు లేని అభాగ్యుడివో
నీవు ఒక ప్రాణివి
తల్లికి తండ్రికి జాతికి ప్రతి రూపానివి
భూమి మీద బ్రతికే హక్కు నీదే!
రాజ్యాలు, సామ్రాజ్యాలు నిన్ను కాదన్నా
ఆర్థిక వ్యవస్థలు ,జనాభా లెక్కలలో లేకున్నా
నా దృష్టిలో నీవు
ఆ కనిపించని దైవం కన్నా మిన్న!
ప్రతి యుగంలో నీ కోసం
జనిస్తారు కలం యోధులు
ఖడ్గసృష్టి కర్తలు, సంస్కర్తలు
నీకున్న ఒకే ఒక డాక్యుమెంటు
నీ వొంట్లో రక్తమే అని నా ఆర్గ్యుమెంటు!
డా.జె. రవీంద్రనాథ్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -