Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫెర్టిలైజర్ సేల్ యాప్‌పై ఎరువుల డీలర్లకు శిక్షణ

ఫెర్టిలైజర్ సేల్ యాప్‌పై ఎరువుల డీలర్లకు శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ – పరకాల
పరకాల మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) జాలిగపు అవినాష్ వర్మ అధ్యక్షతన ఎరువుల డీలర్లకు ఫెర్టిలైజర్ సేల్ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ వ్యవసాయ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా “సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ వినియోగం, ఎరువుల విక్రయ విధానం, నమోదు ప్రక్రియపై డీలర్లకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏడీఏ జాలిగపు అవినాష్ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యూరియా, డీఏపీ తదితర ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, నల్లబజారుకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా సంబంధిత డీలర్ల లైసెన్సులను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు అవసరమైతే పూర్తిగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయిస్తూ రైతులకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు రజా, శరత్, కాటంరాజు పాల్గొన్నారు. అలాగే పరకాల డివిజన్ పరిధిలోని సుమారు 30 మంది ఎరువుల డీలర్లు శిక్షణలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -