నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండలంలోని టాక్లీ (బిగ్) గ్రామంలో 100% ఎస్.ఐ.ఆర్ పనులు పూర్తి చేసిన బి ఎల్ ఎ గణేష్ కు ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బాచా వార్ లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి దీని దయాల్, ఆ గ్రామ సర్పంచ్ కుమారుడైన కాంగ్రెస్ నాయకులు విలాస్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ దేశాయ్, సూర్యకాంత్, మస్నాజీ, తదితరులు కలిసి ఘనoగా సన్మానం చేశారు. మండల పరిధిలోని టాక్లీ (బిగ్) గ్రామంలో ఎస్.ఐ.ఆర్ సంబంధించిన పనులను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన బి ఎల్ ఏ గణేష్‌ను కాంగ్రెస్ నాయకులు అంబినందిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజానన్ దేశాయ్ వారి సేవలను కొనియాడారు. నిర్దేశిత లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేసి, ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షులు బచవార్ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ దీన్‌దయాల్, సర్పంచ్ విలాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ దేశాయ్ సూర్యకాంత్ మస్నాజీలతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బి ఎల్ ఎ గణేష్ ను సన్మానించిన గజానంద్ దేశాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



