Wednesday, August 5, 2026
E-PAPER
Homeజిల్లాలుఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు

ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు

- Advertisement -
  • విద్యార్థులకు సీఐ విద్యాసాగర్ సూచన
    – సెయింట్ పల్లోటిలో సైబర్ దివస్-సురక్షక తిరంగా మానవహారం
    నవతెలంగాణ-బెజ్జంకి

    డిజిటల్ లావాదేవిల్లో ఎప్పుడూ ఎవ్వరీకీ ఓటీపీ పంచుకోవద్దని సీఐ విద్యాసాగర్ విద్యార్థులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలోని సెయింట్ పల్లోటి పాఠశాలలో జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో సైబర్ దివస్-సురక్షక తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖాధిఖారులు జాతీయ జెండాల పట్టుకుని విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. అనంతరం జిల్లా సైబర్ వారియర్స్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజీటల్ లావాదేవిల్లో సైబర్ నేరాలకు గురనైప్పుడు వెంటనే డయల్ 1930కు పిర్యాదు చేయాలని ఎస్ఐ తోట తిరుపతి సూచించారు. అంతకుముందు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహనకు ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. సిద్దిపేట రూరల్, చిన్నకోడూర్ మండలాల ఎస్ఐలు నవత, చంద్ర మోహన్, సైబర్ వారియర్స్ నాంపల్లి శ్రీనివాస్, కిరణ్, కానిస్టెబుల్స్ రవి, రాజు, ప్రిన్సిపాల్ ఫ్యూల, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హజరయ్యారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -