నవతెలంగాణ-ఆర్మూర్ : పట్టణ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ సంఘ భవనం వద్ద బుధవారం పెన్షనర్స్ హక్కుల సాధనకై ర్యాలీ నిర్వహించినారు..ఈ సందర్భంగా రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2026 జనవరి 1 కి ముందు తర్వాత పదవీ విరమణ పొందిన వారిని విభజిస్తూ ఈ విధంగా వర్గీకరణ చేయడం ద్వారా 7 వ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను పరిమితం చేయాలనే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ పెన్షనర్స్ అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ ఈ విధంగా విభజించి పాలించడం సరైన పద్ధతి కాదని ఒకే విధమైన సేవలు చేసిన ఉద్యోగుల మధ్య భేదభావాన్ని సృష్టించడం సరైన పద్ధతి కాదని నల్ల బ్యాడ్జీలు ధరించి బ్లాక్ డే గా పాటించామన్నారు.
పెన్షనర్స్ కు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు పెరుగుతాయని ఆ సమయంలో పింఛన్ మీదనే పూర్తిగా ఆధారపడి జీవించవలసి వస్తుందని,ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాలిడిటీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ , కోశాధికారి నవజీవన్, గౌరవ అధ్యక్షులు రామ్ రెడ్డి,, జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి, రాఘవేందర్ పెన్షనర్స్ సాయన్న, మోహన్ రావు,నర్సిములు,నర్సయ్య, గంగాధర్ కోటేశ్వర్,సుధాకర్,ముత్తెన్న,ఎంసి ఓబన్న, జింధం నరహరి,బ్రహ్మయ్య,రమేష్, సుదర్శన్,రామ్మూర్తి,సత్తయ్య, మల్కన్న,సదానంద్ తదితరులు పాల్గొన్నారు.



