Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసిన సర్పంచ్

విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కేజీబీవీ గురుకుల పాఠశాల విద్యార్థినిలకు బస్వాపూర్ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందని ప్రత్యేక అధికారిని హేమలత తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు హైజినిక్ గా ఉండాలని ఉద్దేశంతో గ్రామస్తులు ఆధ్వర్యంలో ప్లేట్లు గ్లాసులు ఉచితంగా పంపిణీ చేశామని అన్నారు. అదేవిధంగా కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ కేజీబీవీ ప్రత్యేక అధికారిని మరియు ఉపాధ్యాయినిల బృందం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -