నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఆర్టీసీ పాత బస్టాండ్ సర్వేకోసం బుధవారం డిపో డీఎం రవికుమార్ బుధవారం మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం యువకులు మాట్లాడుతూ.. పూర్వమెప్పుడో కట్టిన జుక్కల్ పాత బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బస్టాండ్ లో ప్రయాణికులు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ కూలిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని వారు వాపోయారు. అలాంటి పరిస్థితి రాకముందే పాత బస్టాండ్ ను కూల్చివేయాలని డీఎంకు విన్నవించారు. మరోవైపు బస్టాండ్ ప్రాంగణాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని, ఆ స్థలంలో అధునాతన బస్టాండ్ ను నిర్మించాలని కోరారు. దీనిపై డీఎం సానుకూలంగా స్పందించారని యువకులు స్పష్టం చేశారు.
డీపో డీఎంను కలిసిన జుక్కల్ యువత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



