Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీస్ రాజ్యంగా దేశం

పోలీస్ రాజ్యంగా దేశం

- Advertisement -

​సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం
​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​ఎకె-47లు, పెల్లెట్ గన్‌లనూ ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని పోలీస్ రాజ్యంగా మారుస్తోందని సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం విమ‌ర్శించారు. బుధ‌వారం రాజ్య‌స‌భ‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లుపై జరిగిన చర్చలో ఆయన సీపీఐ(ఎం) త‌ర‌పున మాట్లాడారు. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉంటేనే న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించి వాటన్నింటినీ నాశనం చేసి, భారతదేశాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇటువంటి చర్యలను ఆపి, దేశంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -