- Advertisement -
నవతెలంగాణ-ఏర్గట్ల
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో విషపు గుళికలు తిని నెమలి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. వారి సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చనిపోయిన నెమలికి పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ.. కళేబరాన్ని పూడ్చివేశామని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పరిశీలించినవారిలో.. గ్రామ కార్యదర్శి రాహుల్, జీపీవో భూమన్న, అటవీశాఖ అధికారి వరుణ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



