Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం15 తరువాత వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ?

15 తరువాత వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ?

- Advertisement -

సాధారణంగా 
ఐదు రోజులు
ఒకటే రోజుకు సర్కారు సుముఖం
బీఏసీలో తేలే అవకాశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయమై ఒకింత గందరగోళం నెలకొంది. ఈనెల 15 తరువాత జరిగే అవకాశాలు ఉన్నాయని అసెంబ్లీ అధికారులు అంటుండగా, ఇంకా అవి ఖరారు కాలేదని సచివాలయంలోని ఉన్నతాధికారుల అభిప్రాయం. సాధారణంగా వానాకాలం భేటీ కనీసం ఐదు రోజులు చేపట్టాలి. సమావేశాల తేదీలు, ఏజెండా సమావేశాలు ప్రారంభమయ్యాక బీఏసీలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే సీఎం ఎనుముల రేవంత్‌‌రెడ్డి ఈనెల 15 నుంచి సెప్టెంబరు 10 వరకు యూరప్‌, అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని వార్తలొస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్నారు. వీరంతా అమెరికన్‌ ‌తెలుగు అసోసియేషన్‌(ఏటీఏ) సమావేశాలతోపాటు ఇతర కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నారు. వీరంతా నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
వర్షాకాల సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాల్సి ఉంది. కేవలం ఒక రోజుకే పరిమితం చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. సీఎం అమెరికా పర్యటన ప్రారంభానికి ఒకరోజు ముందు అసెంబ్లీ భేటీ జరుగుతుందనే ప్రచారం జరగనుంది. అసెంబ్లీ, శాసనమండలి కార్యదర్శులు సైతం వానాకాల సమావేశాలపై నోరుమెదపడం లేదు. అంతా సర్కారు నిర్ణయమే అని అంటున్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌‌బాబు, సీఎంతో రేవంత్‌‌రెడ్డితో చర్చించి అనంతరం అసెంబ్లీ స్పీకర్‌, కౌన్సిల్‌ ‌చైర్మెన్‌ ‌మాట్లాడతారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -