Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్‌డీఓ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఆర్‌డీఓ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల
పరకాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

అనంతరం పరకాల మండల పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం స్వీకరించిన రైతులతో ఆర్‌డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల వివరాలు, నష్టపరిహారం చెల్లింపుల స్థితిగతులను సమీక్షించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -