- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్ళు అశ్వారావుపేట మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ భూక్యా ఉదయ్ జ్యోతి,కాసాని నాగ శేష పద్మ,టౌన్ మాజీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ,జుజ్జూరపు శ్రీరామ్మూర్తి,మోటూరి మోహన్ సోమాని రాజా రమేష్, బాలి కిరణ్, రఫీ, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



