Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల స్థాయి సమీక్షా సమావేశం

మండల స్థాయి సమీక్షా సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల ప్రత్యేక అధికారి భీమనపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు సామర్థ్య వృద్ధి (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో జలసిరి,వి బి జి రామ్ జి,సాలిడ్ వాటర్ మేనేజ్మెంట్,ఎస్ బి ఎం,16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం,గ్రామపంచాయతీల సొంత ఆదాయం,వీధి కుక్కల నియంత్రణ,వీధి విద్యుత్ దీపాలను నిర్వహణ,గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల అమలు,ఆయా శాఖల పెండింగ్ అంశాలపై చర్చించి తీర్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,ఎంపీడీవో జిసి మున్నయ్య,ఎంపీఓ రవికుమార్,ఏపీఎం అద్దంకి వెంకట్,ఏపీవో జయరాజు,ఎంఈఓ జి శారదా,ఆయా గ్రామాల సర్పంచులు,పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -