Friday, August 7, 2026
E-PAPER
Homeఖమ్మంసీపీఐ(ఎం) పోరాట ఫలితం.. 

సీపీఐ(ఎం) పోరాట ఫలితం.. 

- Advertisement -

– ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవల బలోపేతం
– ఎండీ, జనరల్ మెడిసిన్ వైద్యుడి చేరిక
– ఖాళీ పోస్టుల భర్తీతో మెరుగుపడనున్న వైద్య సేవలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను జిల్లా వారీగా వైద్యారోగ్య శాఖ భర్తీ చేస్తుండటంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. గత నెలలో నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రిని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పుల్లయ్యతో స్థానిక నాయకత్వం సందర్శించింది.

ఈ క్రమంలో అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం ఎండీ జనరల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ కృష్ణ చైతన్య విధుల్లో చేరారు. ఆయన తన జాయినింగ్ రిపోర్టును ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మౌనికకు అందజేశారు. అదేవిధంగా, ఎన్నడూ లేనివిధంగా రెగ్యులర్ నర్సింగ్ పోస్టులు కూడా భర్తీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి.

ప్రస్తుతం ఆస్పత్రిలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఒక అనస్థీషియా నిపుణుడు, ఒక రేడియాలజిస్టు, ఒక పీడియాట్రిషియన్, ఒక డెంటల్ వైద్యుడు, ఒక ఎండీ జనరల్ మెడిసిన్ నిపుణుడు, నలుగురు ఎంబీబీఎస్ వైద్యులు సేవలందిస్తున్నారు. వైద్యుల సంఖ్య పెరగడంతో రోగులకు నాణ్యమైన చికిత్స మరింత సులభంగా అందే అవకాశం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -