నవ తెలంగాణ – హైదరాబాద్
బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో నిర్వహించిన ఎంఎస్‌ఎంఇ అవుట్‌రీచ్ క్యాంపెయిన్ విజయవంతమైందని ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- హైదరాబాద్ రీజియన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో రూ.40 కోట్ల రుణాల మంజూరు, రూ.60 కోట్ల ఇన్-ప్రిన్సిపల్ అనుమతులు, రూ.50 కోట్ల నూతన వ్యాపార లీడ్లతో కలిపి మొత్తం రూ.150 కోట్ల వ్యాపారాన్ని బ్యాంక్ నమోదు చేసిందని పేర్కొంది. వేదికపైనే రూ.25 కోట్ల రుణాలను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేశామని సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ (ఎంఎస్‌ఎంఇ) డాక్టర్ హిమాన్షు గుప్తా తెలిపారు. ‘కొత్తగా బ్యాంకుకు, క్రెడిట్ వ్యవస్థలోకి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎంఎస్‌ఎంఇ రుణాలను మరింత వేగవంతంగా అందించేందుకు శాఖాధిపతులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ ఎం. పిచ్చయ్య, రీజినల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్, ఎంఎస్‌ఎంఈ జాయింట్ డైరెక్టర్ సి.ఎస్.ఎస్. రావు తదితరులు పాల్గొని అర్హులకు శాంక్షన్ లెటర్లు, చెక్కులను అందజేశారు.
ఎంఎస్‌ఎంఇలకు సెంట్రల్ బ్యాంక్ రూ.150 కోట్ల మద్దతు
- Advertisement -
- Advertisement -



