Saturday, August 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొల్లూరులో పండుగ సాయన్న జయంతి వేడుకలు 

కొల్లూరులో పండుగ సాయన్న జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
దళిత బహుజన మహా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి సందర్భంగా కొల్లూరు గ్రామంలో  సర్పంచ్ సేవ్య నాయక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పలువురు వ్యక్తులు మాట్లాడుతూ 1840-1900 సంవత్సర మధ్యకాలంలో మహబూబ్ నగర్ జిల్లా, నవాబుపేట మండలం కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని మెరుగోనిపల్లి గ్రామంలో జన్మించిన మహావీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు.

బడుగు బలహీన వర్గాల జీవనోపాధి కోసం పిత్తందారులను దోచి బీద వర్గాలకు సాయం చేసిన శ్రమజీవి పండుగ సాయన్న అని కొనియాడారు. బీద కుటుంబాలలో ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం జరిగిందని వారు అన్నారు. అలాంటి మహానుభావుడు జన్మించిన మన గ్రామంలో వారి విగ్రహాన్ని మనము నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందని వారు అన్నారు. విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ సర్పంచ్ విస్లావత్ సేవ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ విస్లావత్ సేవ్య నాయక్, ఉప సర్పంచ్ సునీత జగన్,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విస్లావత్ చందర్ నాయక్, నాయకులు లక్ష్మీ నరసింహ రాజు, మహమ్మద్ ఖాజామైనోద్దీన్,వాసు యాదవ్,ముదిరాజ్ సంఘం నాయకులు పసుల గోపాల్,బంటు శ్రీనివాస్,నర్సింలు,బంటు లక్ష్మయ్య,పసుల కృష్ణయ్య, కమలాకర్, వడ్ల నరసింహచారి చెన్నయ్య, వార్డు సభ్యులు సత్యనారాయణ గౌడ్, పసుల చిట్టయ్య,సున్నాల కృష్ణయ్య, కృష్ణారెడ్డి,కంకంటి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -