కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి తెలిపారు. అపోలో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 49వ కుంజర యాత్ర లో భాగంగా (ఉచిత జీర్ణవ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్లినిక్) ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ తో పాటు వివిధ రకాల నైపుణ్యం గల వైద్యులు ఉంటారని తెలిపారు. నీవు ఉచిత వైద్య శిబిరంలో అల్ట్రా సౌండ్ అబ్డోమెన్, ఫైబ్రో స్కాన్, సిరం క్రియాటిన్, హెచ్ బి ఎస్ ఏజి, యు జి ఐ రెండోస్కోపీ, 2డి ఏకో, ఆర్బిఎస్, హెచ్ఐవి, ప్రోటోస్కోపీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ మొదలగు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
- Advertisement -
- Advertisement -



