నవతెలంగాణ-తుంగతుర్తి
తుంగతుర్తి మండల పిఆర్టియు(టి.ఎస్) నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పోతురాజు చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శిగా బాణాల సంతోష్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా మహమ్మద్ జమాల్ షరీఫ్,మహిళ అసోసియేట్ అధ్యక్షులుగా కొండ లక్ష్మి,ఉపాధ్యక్షులుగా చెంచల వెంకటరమణ,గుడుపూడి సుచిత, కార్యదర్శులుగా ధరావత్ సూర్యచంద్ర, బానోతు రవి,మహిళా కార్యదర్శులుగా మిర్యాల శ్రీదేవి,నిమ్మరబోయిన నవీన ఎన్నికైనట్లు పిఆర్టియు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి తీగల సురేష్ తెలిపారు.
నూతనంగా ఎన్నికైన పిఆర్టియు తుంగతుర్తి మండల కమిటీ సభ్యులకు జిల్లా నాయకులు అభినందనలు తెలిపి ప్రతిజ్ఞ చేయించారు.పదవీకాలంలో చక్కని పనితీరు కనబరచి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ,సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పిఆర్టియు సంఘాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా సమిష్టిగా పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కందుకూరి శివశంకర్,దుండగుల ఎల్లయ్య,తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గుజ్జ భాస్కర్,జాటోత్ రాజన్న,అసానాబాద చంద్రశేఖర్,జిల్లా కార్యవర్గ సభ్యులు చిత్తలూరి శ్రీరాములు,పిన్నం సురేష్, రఘుపతి రాష్ట్ర,జిల్లా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



