Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇక మండలంలోనే ప్రజావాణి.!

ఇక మండలంలోనే ప్రజావాణి.!

- Advertisement -

ప్రతీ సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహణ
నోడల్ అధికారిగా ఎంపీడీఓకు బాధ్యతలు
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రజా సమస్యలు మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతీ సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి, ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఇటీవల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ప్రారంభించగా తాజాగా మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రజావాణి నిర్వహణ,విధివిధానాలపై ఉత్తర్వులు జారీ చేశారు.మండల కేంద్రాల్లో ‘వినతులు స్వీకరించటంతో ప్రజలకు దూరాభారం తోపాటు సమయం, ఖర్చులు ఆదా కానున్నాయి.

నోడల్ అధికారిగా మండల పరిషత్ అధికారి
మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు.ప్రతీ సోమవారం ఉదయం 10:00గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది.ఆయా మండలాల్లో విధులు నిర్వహించే తహసీల్దార్, ఎంపీడీఓ,విద్య, వైద్యం,వ్యవసాయ, రోడ్లు,భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్తు,త్రాగునీరుతోపాటు ఇతర మండలశాఖ అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది.వచ్చిన పిర్యాదులు సంబంధించిన పోర్టల్ లో వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు.పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేసి గ్రీవిన్స్ ఐడి జారీ చేస్తారు.

పకడ్బందీగా నిర్వహణ
ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ నోడల్ అధికారి పర్యవేక్షణలో పకడ్బందీగా జరుగుతుంది.నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లతో పాటు హెల్ప్ డెస్క్, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు త్రాగునీరు,మరుగుదొడ్లు,దివ్యాంగుల కొరకు వీల్ చైర్, వైద్య శిబిరంతో పాటు ఇతర వస తులు కల్పించాలి. ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు,చిన్నపిల్లలతో ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

మండలస్థాయి అధికారులు హాజరయ్యేనా!
మండల కేంద్రంలో ప్రజావాణికి అన్ని శాఖల మండల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కానీ మండలంలో విధులు నిర్వహిస్తున్న పలు శాఖల అధికారులు గతంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలకు హాజరు కాకపోగా తమ కిందిస్థాయి సిబ్బందిని పంపించిన సందర్భాలున్నాయి.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మండల అధికారులు పూర్తి స్థాయిలో హాజరు అవుతారా లేదో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -