రూ.15 నుండి 20 లక్షల విలువగల టెస్టులు
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైనట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి తెలిపారు. అపోలో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 49వ కుంజర యాత్ర లో భాగంగా (ఉచిత జీర్ణవ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్లినిక్) ఈ ఉచిత వైద్య నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ తో పాటు వివిధ రకాల వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో అల్ట్రా సౌండ్ అబ్డోమెన్, ఫైబ్రో స్కాన్, సిరం క్రియాటిన్, హెచ్ బి ఎస్ ఏజి, యుజిఐ రెండోస్కోపీ, 2డి ఏకో, ఆర్బిఎస్, హెచ్ఐవి, ప్రోటోస్కోపీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ మొదలగు పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 298 మందికి రూ.15 నుండి 20 లక్షల విలువగల టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ విమలాకర్ రెడ్డి, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ గౌరంగ్ షోరూప్, డాక్టర్ రాజు ముషం, డాక్టర్ అనురాగ్ భవనం, డాక్టర్ పవన్, డాక్టర్ జయంత్, డాక్టర్ గోపాల్, సిబ్బంది గిరి, తేజ, సందీప్ తదితరులు వున్నారు.



