- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
లాల్ దర్వాజ్ బోనాల వేడుకలలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని కట్ట మైసమ్మ అమ్మ వారిని, సింహవాహిని మహంకాళి అమ్మ వారిని, ఆదిలక్ష్మి అమ్మ వార్లను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడి ఉందని బోనాల ఉత్సవాలనేటివి ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన వ్యవహారం అని అందరి పై అమ్మవారి కటాక్షాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



