Sunday, August 9, 2026
E-PAPER
Homeఖమ్మంతీరిక లేని సమయంలోనూ బంధుత్వానికి ప్రాధాన్యం 

తీరిక లేని సమయంలోనూ బంధుత్వానికి ప్రాధాన్యం 

- Advertisement -
  • బంధువుల బాబు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మంత్రి సీతక్క
    – సమీప బంధువు సుశీల్ ప్రియతమ్ పుట్టినరోజు వేడుకకు హాజరైన మంత్రి సీతక్క
  • – చిన్నారిని ఆశీర్వదించిన మంత్రి
  • నవతెలంగాణ – అశ్వారావుపేట
  • ప్రజాప్రతినిధులు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ కుటుంబ బంధాలకు, బంధుత్వాలకు సమయం కేటాయించడం వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దేశానికి రాజు అయినా కుటుంబంలో సభ్యుడే, రాష్ట్రానికి మంత్రి అయినా బంధువుల్లో ఒకరే అన్న మాటను తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆచరణలో చూపించారు.

ఆదివారం అశ్వారావుపేటలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అనంతరం, మంత్రి సీతక్క తన సమీప బంధువులైన కుంజ రవికుమార్ – సుజాత దంపతుల నివాసానికి వెళ్లారు. అక్కడ వారి కుమారుడు సుశీల్ ప్రియతమ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొని, కేక్ కట్ చేయించి చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆప్యాయంగా గడిపిన మంత్రి, బంధువులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కుంజ సంతోష్ కుమార్ – భవాని,కుంజ వెంకటేశ్వరరావు – జయమని, బాబురావు – సునీత దాదయ్య, నానమ్మ,సున్నం నాగేశ్వరరావు – సుజాత, ఉపాధ్యాయులు కొర్రి వెంకటేష్ – సూరమ్మ, గడ్డం రాజబాబు తదితర సమీప బంధువులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -