Tuesday, August 11, 2026
E-PAPER
Homeసినిమాపవర్‌ఫుల్ ఆఫీసర్ గౌరీ హెగ్డేగా..

పవర్‌ఫుల్ ఆఫీసర్ గౌరీ హెగ్డేగా..

- Advertisement -

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి మొదటిసారిగా కలసి చేస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే టబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఆమె పాత్రకు సంబధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
నగరంలోని స్లమ్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గ్లింప్స్.. అక్కడి రఫ్ అండ్ గ్రిటీ వాతావరణాన్ని పరిచయం చేస్తూ మొదలవుతుంది. ఆ తర్వాత కారు దిగుతూ, సిగరెట్ వెలిగించి, పరిస్థితులను తన కంట్రోల్‌లోకి తీసుకునే గౌరి హెగ్డేగా టబు ఎంట్రీ ఇచ్చారు. స్థానిక గూండాకు వార్నింగ్ ఇచ్చి, ఆ వెంటనే చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో చెబుతోంది.
గౌరి హెగ్డే కేవలం పవర్‌ఫుల్ ఆఫీసర్ మాత్రమే కాదు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని, భయమంటే తెలియని, కాంప్రమైజ్ కాని మహిళగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. రోడ్డుపై గూండాలను ఎదుర్కొంటూ, లాఠీతో వారిని అదుపులోకి తీసుకునే విధానం పాత్రలోని అగ్రెషన్‌ను చూపిస్తుంది. చుట్టూ పోలీసులు, జనం ఉన్నా ఆమె మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పవర్ ని చూపిస్తోంది.
ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -