Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్‌పర్సన్ పరామర్శ

విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్‌పర్సన్ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి :విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ స్తంభం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిన మున్సిపల్ కార్మికుడు పాల్వంచ రాజును మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పరామర్శించారు. మంగళవారం రాజు నివాసానికి వెళ్లిన చైర్‌పర్సన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆమె ఆయనకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిట్టు గంగాధర్, కాళ్ల గణేష్, అంజాద్, మహేష్, మోతిలాల్, రామ్మోహన్, సత్యం, నాయకులు నాగరాజు, కార్మిక నాయకులు ప్రభు, నర్సింగ్‌రావు, అయ్యాజ్, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -