Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోనాలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం 

బోనాలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల , కళాశాలలో బోనాలు సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని కొనియాడారు. విద్యార్థులకు బోనాల సంస్కృతి, విశిష్టతను తెలియజేయుటకు ఈ బోనాలు సంబరాలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయానికి ర్యాలీగా ఆనందోత్సాహాలతో నృత్యాలు, పాటలతో విధుల గుండా ప్రదర్శనని నిర్వహించారు. బాల్కొండ గ్రామపంచాయతీ సర్పంచ్ గాండ్ల రాజేష్ విద్యార్థుల ప్రదర్శనను చూసి విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభని కొనియాడారు. ఇలాంటి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ప్రశాంత్, ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణేష్,  ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -