- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్, రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్, కిలిమంజారో పర్వతారోహకుడు, వరల్డ్ రికార్డు బుక్లో చోటు సంపాదించిన మహిపాల్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు తగు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -


