- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట: మండల పరిధిలోని యన్మన్గండ్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ రంజిత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సుష్మ భారతీ లు కలిసి పంచాయతీ తీర్మానం ఆమోదం లేకుండా వార్డు సభ్యులకు తెలియకుండానే డబ్బులు డ్రా చేసి వాడుకున్నారని మంగళవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి డ్రా చేసిన నిధులపై విచారణ జరిపి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కోస్గి చిట్టెమ్మ కొనింటి బాలయ్య,కోస్గి సరోజ రియాజ్,అంజమ్మ,స్వరూపరాణి తుల్య నాయక్,రఘు లు ఉన్నారు.
- Advertisement -



