Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలి 

పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలి 

- Advertisement -

టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు
నవతెలంగాణ-మిడ్జిల్

ఉపాధ్యాయుల, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న 6 విడతల డీఏలను వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను పునర్ధరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు, మండల అధ్యక్షులు వెంకటయ్య ప్రభుత్వాన్ని కోరారు. యు ఎస్ పి సి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దశాల వారి ఉద్యమాల కార్యక్రమంలో భాగంగా బుధవారం భోజన విరమణ సమయంలో తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డికి ఉపాధ్యాయుల డిమాండ్ వినతి పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం బేసిక్ పే అమలు చేయాలని, ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలనీ, కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులు లాగా అన్ని రకాల సేవలు, సౌకర్యాలు, హెల్త్ కార్డులు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు నాయకులు రమేష్, నరసింహులు, రమేష్ ,కృష్ణయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -