Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశా కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చాలి

ఆశా కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చాలి

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
ఆశా కార్యకర్తలు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉచిత వైద్యం, నెలకు 18 వేల జీతం ప్రభుత్వం ప్రకటించాలని జిల్లా నాయకురాలు జయమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. ఈ మేరకు గడిచిన రెండు సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ, నిరసనలు చేపట్టినప్పటికీ నేటి వరకు కూడా ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. చాలీచాలని వేతనాలతో, కరోనా కష్ట కాలంలో ప్రాణాలను తెగించి ఎంతోమంది రోగులను కాపాడి, జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -