Thursday, August 13, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుత్తు షాక్ తో వ్యక్తి మృతి 

విద్యుత్తు షాక్ తో వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ, మెండోరా
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మెండోరా ఎస్ ఐ సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. కోడిచర్ల గ్రామానికి చెందిన మెట్టు కైలాస్ (51) బుధవారం తన ఇంటిని శుభ్రం చేసే క్రమంలో ఇంట్లో దూలాలపై ఉన్న ఓ ఇనుప రేకుకు తెగి ఉన్న విద్యుత్తు తీగ తగిలింది. ఆ ఇనుప రేకును ముట్టుకున్న కైలాస్ కు ఒక్క సారిగా విధ్యుత్ షాక్ తగలి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నిర్మల్ ఆస్పత్రికి తరలించగా హాస్పిటల్ చేరుకోగానే కైలాస్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -