- Advertisement -
నవతెలంగాణ-మిడ్జిల్
80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జడ్చర్ల పట్టణంలో నోవస్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ డా. ప్రణయ్, ఎం డి, డిఏం కార్డియాలజీ, డా ఎన్. ప్రతిమ, ఎండి. డెర్మాటలజీ ఆధ్వర్యంలో 14,15,16 తేదీలలోఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రణయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపులో గుండె, చర్మ వ్యాధులకు సంబంధించిన సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్ రోడ్డులో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
- Advertisement -



