Thursday, August 13, 2026
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ బాలికల జూ. కళాశాలలో నోట్‌బుక్స్, బ్యాగ్స్ పంపిణీ

ప్రభుత్వ బాలికల జూ. కళాశాలలో నోట్‌బుక్స్, బ్యాగ్స్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – సత్తుపల్లి
స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినులకు గురువారం ఉచితంగా నోట్‌బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ చేతుల మీదుగా విద్యార్థినులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ… పేద విద్యార్థుల ప్రయోజనం కోసమే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నోట్‌బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకుని ఉపాధ్యాయులుగా, లెక్చరర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ​ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల సమగ్ర అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.  భాగ్యలక్ష్మి మాట్లాడుతూ… గత 20 ఏళ్లుగా ఈ కళాశాల అభివృద్ధిలో దయానంద్ విజయకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ​దయానంద్ విజయకుమార్ స్వయంగా కళాశాలకు వచ్చి ఎప్పటికప్పుడు అవసరాలను తెలుసుకుంటూ, పేద విద్యార్థులకు నిరంతరం సాయమందిస్తున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు.

​ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు విద్యా సామగ్రి అందించడం పట్ల కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. ఈ  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి. భాగ్యలక్ష్మితో పాటు అధ్యాపకులు, సిబ్బంది లలితమ్మ, ప్రమీల, వనజరాణి, కల్పన,  సత్యనారాయణ, కృష్ణవేణి, రామారావు, రాణి, శ్వేత, సమ్మక్క, శిరోమణి, వెంకటేశ్వరరావు, సౌజన్య, సీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -