Wednesday, April 1, 2026
E-PAPER

ఎందుకిలా?

- Advertisement -

సుప్రీంకోర్టులో అనిల్‌ అంబానీకి షాక్‌
బాంబే హైకోర్టులో గౌతమ్‌ అదానీకి ఊరట
ఇద్దరు బడా వ్యాపారుల కేసుల్లో భిన్నమైన నిర్ణయాలు
న్యూఢిల్లీ :
భారత్‌లో సుప్రీంకోర్టు, బాంబే కోర్టులు బడా కార్పొరేట్‌ సంస్థలపై వచ్చిన ఆర్థిక మోసం, లంచాల ఆరోపణల విషయంలో పూర్తి గా భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఒకటి దర్యాప్తు సంస్థలను కఠినంగా ప్రశ్నించగా.. మరొకటి కేసును మొదటి దశలోనే తిరస్కరించిం ది. అయితే ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో అసమానతలపై చర్చకు దారి తీసింది. సుప్రీంకో ర్టు అనిల్‌ అంబానీ గ్రూప్‌పై దర్యాప్తు వేగవంతం చేయాలని సంస్థలను గట్టిగా మందలించింది. అయితే బాంబే హైకోర్టు మాత్రం అదానీ గ్రీన్‌పై వచ్చిన లంచాల ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వకుండా పిటిషన్‌ను కొట్టివేసింది.

సుప్రీంకోర్టులో అనిల్‌ అంబానీ కేసు
అనిల్‌ అంబానీకి చెందిన అనిల్‌ ధీరూభారు అంబానీ గ్రూపు (అడాగ్‌) కంపెనీలపై సుమారు రూ.40 వేల కోట్లకు సంబంధించి భారీ బ్యాంకు మోసం ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పిటిషన్‌ దాఖలు చేసింది ప్రభుత్వ మాజీ సెక్రెటరీ ఇ.ఎ.ఎస్‌ శర్మ. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ కేసులో వాదనలు వినిపించారు. మార్చి 23న సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది. అయితే ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. కీలక విషయాలను గమనించింది.

దర్యాప్తు సంస్థలపై అసంతృప్తి
కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌ మె ంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చూపుతున్నాయని గుర్తించింది. దర్యాప్తు ప్రజలకు నమ్మకం కలిగించేలా ఉండాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని సూచించింది. బ్యాంకు అధికారులు, ఇతరుల కుమ్మక్కు కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. మొత్తంగా దర్యాప్తును వేగంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంస్థలను ఆదేశించింది.

బాంబే హైకోర్టులో ఇలా
ఇటు మరో బడా వ్యాపారవేత్త, మోడీ మిత్రుడిగా చెప్పబడే గౌతం అదానీ.. బాంబే హైకోర్టులో కేసును ఎదుర్కొన్నారు. న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలోని బాంబే హైకోర్టు ఈ కేసును విచారిం చింది. గౌతం అదానీ గ్రూపునకు చెందిన అదానీ గ్రీన్‌ ఎనర్జీపై లంచాల ఆరోపణల విషయంలో జితేంద్ర పి.మారు అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేశారు. డిస్కమ్‌ అధికారులకు రూ.2వేల కోట్ల ముడుపులు ఇవ్వజూపారనీ, అధిక ధరలతో విద్యుత్‌ ఒప్పందా లు చేసుకున్నారనే ఆరోపణలను ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో బాంబే హైకోర్టు భిన్నంగా స్పందించింది.

పిటిషనర్‌ను మందలించిన కోర్టు
న్యాయస్థానం సదరు పిటిషన్‌ను ‘కోర్టు ప్రక్రియ దుర్వినియోగ చర్య’గా అభివర్ణించింది. ఈ మేరకు పిటిషనర్‌ను మందలించింది. పిటిషనర్‌కు సరైన విశ్వసనీయత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. న్యాయస్థానం పిటిషన్‌లోని ఆరోపణలపై కాకుండా పిటిషనర్‌ మీదనే అధికంగా దృష్టి పెట్టింది. ఈ కేసులో సుప్రీంకోర్టుకు భిన్నంగా వ్యవహరించిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలనో, దర్యాప్తు జరపాలనో కాకుండా పిటిషనర్‌ విశ్వసనీయతను న్యాయస్థానం ప్రశ్నించిందని వివరిస్తున్నారు.పై రెండు కేసుల్లో ఇద్దరూ బడా వ్యాపారవేత్తలు.

కార్పొరేట్‌ శక్తులు. ఇద్దరూ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులనే ఎదుర్కొంటున్నారు. కానీ సుప్రీంకోర్టు.. దర్యాప్తు జరపాలంటూ సంస్థలను ఆదేశించగా.. బాంబే హైకోర్టు మాత్రం పిటిషనర్‌ను దృష్టిలో పెట్టుకొని పిటిషన్‌ను కొట్టివేసిందని విశ్లేషకులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనం దృష్టితో ముందుకెళ్తే… హైకోర్టు మాత్రం పిటిషన్‌ లోపాల మీదే దృష్టి పెట్టిందని వివరిస్తున్నారు. అయితే కోర్టుల తీర్పులను తప్పుబట్టలేమని కూడా చెప్తున్నారు. అయితే రెండు కార్పొరేట్‌ శక్తులపై వచ్చిన ఆరోపణలపై కోర్టుల స్పందనలు ప్రస్తుతం ఇది న్యాయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోందని చెప్తున్నారు. ఈ రెండు తీర్పులు న్యాయవ్యవస్థలో సమాన ప్రమాణాలు అవసరం అనే చర్చను తెరపైకి తెచ్చాయని వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -