Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్పునుంతలలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

ఉప్పునుంతలలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

- Advertisement -

– రైతు, కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ – ఉప్పునుంతల 

ఏప్రిల్ 2న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన సభలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి మెంట తిరుపతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలో మొక్కజొన్న పంట, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా ప్రజా పాలన సభల వేదికగా ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.

మండలంలో రైతులు మొక్కజొన్న, వరి ధాన్యాన్ని విక్రయానికి సిద్ధంగా ఉంచినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు వాతావరణ మార్పులు, అకాల వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తమ పంటలను తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల ఎరువుల ధరలు పెరిగి రైతులపై అదనపు భారం పడే అవకాశం ఉందని తెలిపారు.

మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, అలాగే రెవిన్యూ శాఖ నిషేధిత జాబితాలో ఉన్న సాగు భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు పరుశరాములు, కొట్టే మల్లయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -