నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జన్మదిన వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జన్మదిన పురస్కరించుకొని మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ.. జుక్కల్ అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే షిండే తోనే సాధ్యమని పేర్కొన్నారు. జుక్కల్ ప్రజల ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు జీవించి ప్రజాసేవకు అంకితం కావాలని నాయకులు కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కాశీనాథ్ పటేల్ మద్నూర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ విజయ్ కుమార్, మండల నాయకులు బన్సీ పటేల్, వై గోవింద్ పటేల్, కృష్ణ పటేల్, మాజీ సర్పంచ్ సురేష్, అంతపూర్ మారుతి, పెద్ద ఎక్లారా ప్రదీప్ పటేల్, సుధాకర్ పటేల్, కంచిన్ హనుమాన్లు, ధూమ్ మేస్త్రి హనుమాన్లు, మహిళా నాయకురాలు సరస్వతి, మండల నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేకు సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



