Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ లో గ్రామ సభ..

జుక్కల్ లో గ్రామ సభ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ సమావేశం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపిడివో శ్రీనివాస్ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి సర్పంచ్ కర్రేవార్ సావిత్రి సాయాగౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి ఎజెండా అంశములను జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ చదివి వినిపించి ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడమైనది. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కారపు దిశగా తీర్మానం చేయనైనది. ఇది సమావేశానికి మండల ప్రత్యేక అధికారి జడ్పి సీఈఓ చంద్ర నాయక్ సార్ , ఎంపీడీవో శ్రీనివాస్ సార్ ,  ఉప సర్పంచ్ షేక్ ఫిర్దోస్, ఎక్స్ సర్పంచ్ లు సాయగౌడ్ ,  బొంపెలి రాములు ,యువజన నాయకుడు బి. విజయ్ కూమార్, గ్రామస్థాయి అధికారులు, మహిళా సంఘ సభ్యులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా మండలం లోని లాడేగావ్ సర్పంచ్ రాజశేఖర్ పటేల్ ,  పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ , డోన్ గావ్ సర్పంచ్ కే. శ్రీనివాస్ , చండేగావ్ సర్పంచ్ లక్ష్మణ్ , మాదాపూర్ సర్పంచ్ ఆశా పటేల్, హంగర్గ సర్పంచ్ కుమ్మరి నర్సింలు, బిజ్జాల్వాడి సర్పంచ్ గంగా బాయి, నాగల్ గావ్ సర్పంచ్ జాదవ్ సునంద, బస్వాపూర్ జిపి రమణ, పడంపల్లి గ్రామ సర్పంచ్ విజయ కూమారి, చిన్ని గుల్లా సర్పంచ్ జ్ఞానేశ్వర్, లొంగన్ సర్పంచ్ నాగల గిద్దె ఉషారాణి సదు పటేల్, వజ్రఖండి సర్పంచ్ చింత్రాలే సావిత్రి, దోస్తు పల్లి సర్పంచ్ మారుతీ, మథురాతాండా సర్పంచ్ అనిత , ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణ ,సోపూర్ సర్పంచ్ తుకారం, మైబాపూర్ సర్పంచ్ బశవ్వ రెడ్డి , గుల్లా తాండా సర్పంచ్ సుమతి యశ్పాల్, కత్తల్ వాడి సర్పంచ్ గోపాలరావు, అద్యక్షతన గ్రామ సభలు సమావేశాలు నిర్వహించారు అని కార్యదర్శులు తెలపడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -